Michaung Cyclone : నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఎడతెరిపి లేకుండా కరుస్తోన్న వర్షం, రెడ్ అలెర్ట్

ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరి నారాయన్ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

Michaung Cyclone Effect : నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరి నారాయన్ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.

Cyclone : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం

తుఫాన్ కారణంగా సోమవారం విద్యాసంస్థలకి సెలవు ప్రకటించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మైపాడు, కోడూరు, తూపిలి పాలెం, తుమ్మలపెంట బీచ్లు మూసివేశారు. జలాశయాలు, చెరువుల వద్ద ప్రత్యేక అధికారులు పరిశీలన చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు