Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేత, సహాయకచర్యలకు ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లు ఇవ్వాలన్న రామకృష్ణ

పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు వసతి, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని సూచించారు.

Durgagudi Ghat road

Michaung Cyclone – Durgagudi Ghat Road Closed : మిచాంగ్ తుఫాన్ భయానకంగా మారింది. ఏపీ వైపు తుఫాన్ దూసూకోస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మిచాంగ్ తీవ్ర తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 170 కిలో మీటర్లు, నెల్లూరుకు 20 కిలో మీటర్లు, బాపట్లకు 150 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 210కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నానానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మీచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కొండ చర్యలు ఇరిగిపడతాయని దుర్గగుడి అధికారులు ముందుగానే ఘాట్ రోడ్డు ముసి వేశారు. దుర్గగుడికి కార్లకు, ద్విచక్ర వాహనాలు పై వచ్చే భక్తులకు అనుమతి లేదని దుర్గగుడి అధికారులు తెలిపారు. దుర్గ గుడికి వచ్చే భక్తులు మెట్ల మార్గం, లిఫ్ట్ మార్గం ద్వారా దుర్గగుడికి రావాలని ఆలయ అధికారులు సూచించారు.

Michaung Cyclone Effect : భయానకంగా మారిన మిచాంగ్ తుపాన్.. ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లు కేటాయించాలి : కె రామకృష్ణ
మిచాంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు కనీసం రూ.10 కోట్ల చొప్పున కేటాయించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒక్కో జిల్లాకు కేటాయించిన రూ.2 కోట్లు ఏమాత్రం సరిపోవన్నారు. నిన్నటి వరకు కరువుతో అల్లాడిన రైతాంగానికి నేడు తుఫాన్ కన్నీళ్లు తెప్పిస్తోందని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో తీవ్ర తుఫాను రైతులను వణికిస్తోందని వాపోయారు.

పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు వసతి, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని సూచించారు. తిరుపతిపై మీచాంగ్ తుఫాన్ విరుచుకుపడింది. గతరాత్రి ఎడతెరపి లేని వర్షం కురిసింది. రాత్రంతా తిరుపతి అంధకారంలోనే మగ్గింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు.

Michaung Cyclone : తెలంగాణపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు… స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు

నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల పాత ఇంటి గోడలు కూలిపోయాయి. పలు చోట్ల వాహనాలు ధ్వంసం అయ్యాయి. కపిలతీర్థం జలపాతం పొంగిపొర్లుతోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమీషనర్ హరిత, ఉప మేయర్ అభినయ్ రెడ్డి సందర్శిస్తున్నారు.

ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప.గో, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Michaung Cyclone : తెలంగాణపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు… స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు

నెల్లూరు, కడప, తూ.గో, కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు