Michaung Cyclone : తెలంగాణపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు… స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు

ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

Michaung Cyclone : తెలంగాణపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు… స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు

Michaung Cyclone Rins

Michaung Cyclone Bhadradri Kothagudem : తెలంగాణపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం పడింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మిచాంగ్ తుఫాన్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు చేపట్టారు.

Michaung Cyclone : చెన్నైలో జలప్రళయం .. 2015లో వరదల కంటే దారుణం.. 47ఏళ్లలో ఇదే తొలిసారి

మిచాంగ్ తుఫాన్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సెలవు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వివిధ కారణాలతో సింగరేణి అధికారులు జీకేఓసీని మూసి ఉంచారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తీవ్ర తుఫాన్ గా మారింది. తీవ్ర తుఫాన్ గా మారిన మిచాంగ్ ఏపీ వైపు దూసుకొస్తోంది.

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచాంగ్ తీవ్ర తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 170 కిలో మీటర్లు, నెల్లూరుకు 20 కిలో మీటర్లు, బాపట్లకు 150 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 210కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నానానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

Michaung Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మిచాంగ్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పడుతున్నాయి. అక్కడక్కడ తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది.