Michaung Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మిచాంగ్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.

Michaung Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మిచాంగ్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Michaung cyclone (2)

Michaung Cyclone Heavy Rains : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు పొంచివుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తీవ్ర తుఫాన్ గా బలపడింది. తీవ్ర తుఫాన్ గా మారిన మిచాంగ్ ఏపీ వైపు దూసుకొస్తోంది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచాంగ్ తీవ్ర తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 170 కిలో మీటర్లు, నెల్లూరుకు 20 కిలో మీటర్లు, బాపట్లకు 150 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 210కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

మధ్యాహ్నానానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పడుతున్నాయి. అక్కడక్కడ తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ సూచించారు.

Cyclone Michaung : తరుముకొస్తున్న తుపాను.. సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర ప్రభావం
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది. విపరీతంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రచండ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలుచోట్ల కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల కార్లు, ఇతర వాహనాలపై చెట్లు కూలాయి. గాలుల ధాటికి ఆర్టీసీ బస్సు పై కప్పు లేచిపోయింది. జిల్లా అంధకారంలో చిక్కుకుంది. కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. భారీగా ఆస్తి నష్టం వాటల్లింది. మొబైల్ నెట్ వర్క్స్ పని చేయడం లేదు. నెల్లూరులోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వైయస్సార్ కాలనీ, చంద్రబాబు నగర్, ఆర్టీసీ కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మూడు ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Cyclone Michaung : ఏపీ వైపు ముంచుకొస్తున్న మిచాంగ్ ముప్పు.. అత్యంత క్లిష్ట సమయం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు, స్కూళ్లకు సెలవులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 2లక్షలకు పైగా ఎకరాలలో వరి పంటకు తీవ్ర నష్టం వాటల్లింది. ఈదురుగాలలకు అరటి తోటలు నెల కొరిగాయి. చలి గాలులతో కూడిన వర్షం పడుతూ ఉండటంతో ఆక్వా రైతులు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

భీమవరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావాన్ని రైతులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఈరోజు కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

Amaravati : అమరావతే ఏపీ రాజధాని- పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్రం

అమరావతిపై తుఫాన్ ప్రభావం పడింది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తీరంలో సముద్రం పోటెత్తుతోంది. తుఫాన్ తీరం దాటే సమయానికి సముద్రజలాలు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదముందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టులకు 10వ నెంబర్, కాకినాడకు 9, విశాఖ, కళింగపట్నం పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు.

పలు విమాన సర్వీసులు రద్దు
ఇక హైదరాబాద్, రేణిగుంట, విశాఖ, చెన్నై ఎయిర్ పోర్టుల్లో పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. మిచాంగ్ తుఫాన్ అమరావతిలో అన్నదాతలు కలవర పడుతున్నాయి. మిచాంగ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలగా, కోసిన వరి లక్షల ఎకరాల్లో నీళ్లలో తేలుతోంది.

Michaung Cyclone Updates: తీవ్ర తుపానుగా మారిన మిచాంగ్.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. విమాన సర్వీస్సులు రద్దు

తుఫాన్ పై ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను అప్రమత్తం చేయలేదు. దీంతో ధాన్యం వర్షానికి తడిసి రంగు మారే ప్రమాదం ఉంది. అటు పలుచోట్ల పొగాకు, మిర్చి, మొక్కజొన్న, బొప్పాయి, అరటి, వేరుశనగ పంటలు సైతం దెబ్బతిన్నాయి.