Cyclone Michaung : తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

ఇది ఒక సవాల్ లాంటిందని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Cyclone Michaung : తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

cm jagan review on cyclone michaung conditions

తుపాను తరుముకొస్తోంది. మిచాంగ్ ముప్పు ముంచుకొస్తోంది. తమిళనాడును అతలాకుతలం చేసిన సైక్లోన్ ఏపీవైపు దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడింది. నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.

Also Read : ఏపీ వైపు ముంచుకొస్తున్న మిచాంగ్ ముప్పు.. అత్యంత క్లిష్ట సమయం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు, స్కూళ్లకు సెలవులు

తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తం అయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ ను అలర్ట్ చేశారు. అలాగే తుఫాన్ ప్రభావిత జిల్లాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు జగన్. ఎస్పీలు, కలెక్టర్లకు ఇది ఒక సవాల్ లాంటిందని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పంట కోతకు వచ్చే సమయంలో తుఫాను ముంచుకురావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని అధికారులకు జగన్‌ సూచించారు. పొలాల్లో కోయని పంటను అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు.

Also Read : ధైర్యంగా ఉండండి, మేము మీతోనే ఉన్నాము.. చెన్నైలో వర్ష బీభత్సంపై కవిత ట్వీట్

వర్షాల కారణంగా ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను తీవత్ర తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం చెల్లించాలని చెప్పారు. తుపాను ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.