Michaung Cyclone Updates: తీవ్ర తుపానుగా మారిన మిచాంగ్.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. విమాన సర్వీస్సులు రద్దు

తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి.

Michaung Cyclone Updates: తీవ్ర తుపానుగా మారిన మిచాంగ్..  ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. విమాన సర్వీస్సులు రద్దు

Michaung Cyclone

Michaung Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మిచాంగ్ ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరప్రాంతాన్ని ఆనుకొని కదులుతున్న తీవ్ర తుఫాను.. చెన్నైకి 90 కిలో మీటర్లు, నెల్లూరుకు 120, మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాస్తాంధ్ర తీరానికి సమాంతరంగా సముద్రంలో గంటకు 10 కిలో మీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మచిలీపట్నం – బాపట్ల తీరాల మధ్య నిజాంపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది.

Also Read : Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. లోకేష్ యువగళం పాదయాత్రకి 3 రోజులు తాత్కాలిక విరామం

తమిళనాడులో భారీ వర్షాలు..
తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. చెన్నై ఎయిర్ పోర్టు రన్ వేపైకి భారీగా వరద నీరు చేరడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 16 విమానాలను రద్దు చేశారు. సోమవారం అర్థరాత్రి వరకు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులో భారీగా వర్షపు నీరు చేరింది. తమిళనాడులో వర్ష బీభత్సానికి వరదనీటిలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు..
ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆదివారం నుంచి జిల్లా అంతట భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడిఉన్న మండలాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. వచ్చే 48 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సోమవారం జిల్లాలో స్కూళ్లుకు సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా బి.ఎన్ కండ్రిగ మండలంలో 156.8 మిల్లీమీటర్లు,వరదయ్యపాలెం మండలంలో 129.2 మి.మీ, శ్రీకాళహస్తిలో 124.0 మి.మీ, తొట్టంబేడులో 123.0 మి.మీ వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో మొత్తం సోమవారం ఒక్కరోజే 1831.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం ప్రభావంతో జనజీవనం స్తంభించింది. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో 25.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read : Michaung Cyclone Alert : మిచాంగ్ ముప్పు! కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుపాన్.. సీమ, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

పలు విమానాలు రద్దు ..
తుఫాను ముప్పు కారణంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన ఇండిగో విమానం తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవటంతో తిరిగి హైదరాబాద్ కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాల్సిన స్పైస్ జెట్ ను ఏవియేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన ఇండిగో విమానం రద్దయింది. తిరుపతి నుంచి వయా విజయవాడ మీదుగా విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దయింది. విశాఖ నుంచి తిరుపతికి రావాల్సిన ఇండిగో విమానంను ఇండిగో సంస్థ రద్దు చేసింది. మొత్తం నాలుగు ఇండిగో విమాన సర్వీసులు, ఒక స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

పలు రైళ్లు రద్దు..
మరోవైపు కాకినాడ ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేశారు. తుపాను దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. రైలు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడుపుతున్నారు.