Milan 2022 : INS విశాఖ నౌక జాతికి అంకితం.. అలరించిన యుద్ధ విన్యాసాలు

INS విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్. నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు...

Milan 2022 Operational Demonstration : INS విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్. నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. INS విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది. విశాఖ బీచ్‌లో మిలాన్‌ 2022 కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్‌ దంపతులు.

Read More : Vizag : విశాఖకు సీఎం జగన్.. యుద్ధనౌకల సమాహారం

మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు. గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. తూర్పునౌకాదళం వేదికగా ఈ మిలాన్‌ విన్యాసాలు మార్చి 4 వరకూ జరగనున్నాయి. సుమారు 39 దేశాల నుంచి నౌకలు, సబ్‌మెరైన్‌లు, యుద్ధవిమానాలు మిలాన్‌ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మిలాన్‌-2022లో భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Read More : Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..

యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు, మెరైన్‌ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్‌ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా నేవీ దళాలు బీచ్‌ రోడ్డులో కవాత్‌ నిర్వహించాయి. పలు సైనిక స్కూళ్లకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బీచ్‌లో శత్రుసేనలను మట్టుపెట్టే దృశ్యాలు అబ్బురపరిచాయి. బీచ్‌రోడ్డును సర్వాంగ సుందరంగా జిల్లా అధికార యంత్రాంగం, నేవీ సిద్ధం చేసింది. ఇప్పటికే విద్యుద్దీపాల అలంకరణతో బీచ్‌ రంగుల మయంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు