Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..

రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్ఆర్) జరుగనుంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్న..

Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..

Vishaka

Naval Capability At Visakha : విశాఖ సాగర తీరం యుద్ధనౌకలతో దద్ధరిల్లనుంది. యుద్ధ విమానాల భారీ శబ్దాలతో ఆకాశం హోరెత్తనుంది. సైనిక విన్యాసాలు అలరించనున్నాయి. యుద్ధనౌకలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలి రావడంతో సాగర తీరం సందడిగా మారింది. విశాఖపట్టణంలో 2022, ఫిబ్రవరి 21వ తేదీ సోమవారం రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్ఆర్) జరుగనుంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Read More : GVMC : విశాఖలో ఫ్లీట్‌ రివ్యూ, బీచ్ రోడ్డులో భవన యజమానుల్లో టెన్షన్.. ఎందుకంటే

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, శాసనసభాపతి సీతారం, పలువురు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ విశాఖకు చేరుకున్నారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముంబై, అండమాన్ – నికోబార్, కొచ్చి తదితర ప్రాంతాల నుంచి యుద్ధ నౌకలు విశాఖకు చేరుకున్నాయి. ఇక ఆదివారం నమూనా ఫ్లైపాస్ట్ విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలు వీక్షకుల ఒళ్లు గగుర్పొడిచాయి. యుద్ధ విమానాలు వాయివేగంతో ప్రయాణించడంతో భారీ శబ్ధాలకు ఆకాశం హోరెత్తింది. ఈనెల 27వ తేదీన నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు అంతర్జాతీయ నగర కవాతు జరుగనుంది. ఈ సందర్భంగా…అధికారులు ఆ ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు.  విశాఖలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూతో పాటు మిలాన్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి దేశ, విదేశాల నుంచి వందలాది మంది హాజరుకానున్నారు.

Read More : AP PRC : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుకు జీవోలు విడుదల

పాల్గొనే యుద్ధనౌకలు : –
INS వేలా జలాంతర్గామి, ఐఎన్ఎస్ తేజ్, శివాలిక్ శ్రేణి యుద్ధనౌకలు (మూడు), కమోర్తా యుద్ధనౌకలు, షిప్పింగ్ కార్పొరేషన్ కు చెందిన నౌకలు పీఎఫ్ఆర్ లో పాల్గొంటున్నాయి. కోస్ట్ గార్డ్ NIOT, కమోవ్ హెలికాప్టర్లు, సీకింగ్, చేతక్, ALH, డోర్నియర్, IL-38SD, P8I, హాక్, మిగ్ 29K తదితర యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి.