AP PRC : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుకు జీవోలు విడుదల

ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ  ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను పెంచుతూ ఉత్తర్వుల

AP PRC : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుకు జీవోలు విడుదల

YS Jagan Mohan Reddy

AP PRC : పీఆర్సీ అంశంపై  ఏపీ  ఎన్‌జీవో నాయకులు… ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ  ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు కొత్త పీఆర్‌సీ జీవోలను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. 10, 12, 16, 24 శాతాల తో హెచ్ఆర్‌ఏ అమలు చేయాలని జీవోలను విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులు… హెచ్‌ఓడీలకు 24 శాతం హెచ్చార్‌ఏ… ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

2024 జూన్‌ వరకు సెక్రటేరీయేట్‌, హెచ్‌ఓడీ  ఉద్యోగులకు 24 శాతం హెచ్చార్‌ఏను ఇవ్వనున్నారు.
కొత్త  పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను సవరిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  2022 జనవరి నుంచి కొత్త వేతన స్కేళ్లు అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

11 వ పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలు, పెన్షన్లను నిర్దారిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  2022  జనవరి నెలకు చెల్లించిన వేతనాల్లో   హెచ్చుతగ్గులను సవరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 2022 నెలకు సంబంధించిన వేతన, పెన్షన్ బిల్లులను సిద్ధం చేయాలని డీడీఓలకు ఆదేశాలు ఇచ్చింది.
Also Read : AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు
రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను నిర్దారిస్తూ కూడా ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది.  70 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్‌ చెల్లింపు… 75 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 12 శాతం పెన్షన్‌ చెల్లింపు…80 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 20 శాతం పెన్షన్‌ చెల్లింపు….85 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 25 శాతం పెన్షన్‌ చెల్లింపు….90 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 30 శాతం పెన్షన్‌ చెల్లింపు…95 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 35 శాతం పెన్షన్‌ చెల్లింపు….100 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 50 శాతం పెన్షన్‌ చెల్లింపు చేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలలో పేర్కోంది.