Minister Ambati Rambabu: ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నా లక్ష్మీనారాయణది

వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు.

Ambati Rambabu

YCP MLA: మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యాడు. ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. రాజారెడ్డి గురించి ముఖ్యమంత్రి జగన్ గురించి కన్నా లక్ష్మీనారాయణ అవాకులు చవాకులు పేలుతున్నాడు. పలు పార్టీలు మారిన వ్యక్తికూడా, సిగ్గువదిలి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. మొన్నటి వరకు చంద్రబాబును తిట్టిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు వారి బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నాడని విమర్శించారు.

Gidugu Rudra Raju : సోనియాగాంధీని చెడుగా చూపిస్తే బట్టలు ఊడదీసి కొడుతాం.. రాంగోపాల్ వర్మకు గిడుగు రుద్రరాజు వార్నింగ్

వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే హక్కు కన్నాకు లేదు. సత్తెనపల్లి‍‌లో ఇంచార్జ్ మాత్రమే కన్నా.. పోటీచేస్తాడో పారిపోతాడో తెలీదు. కన్నా సంగతి బీజేపీ చెబుతుంది. బీజేపీ ఎన్నికల ఖర్చుకోసం ఫండ్ పంపితే మింగిన ఘనత మాజీ మంత్రి కన్నాది. కన్నా సంగతి అమిత్ షా బాగా చెబుతాడు అంటూ అంబటి రాంబాబు అన్నారు.

Leopard : తిరుమల నడక దారిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

కన్నా సంగతి గుంటూరులోకంటే.. వారి తోటలో ప్రజలు చెబుతారు. ఆయన ఇంటిముందు ఫ్లెక్సీలు చెబుతాయి. కన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కలవదు. గతంలో చంద్రబాబు మీద చేసినట్లు.. ఇప్పుడు సీఎం జగన్‌పై చేస్తే వైసీపీ సహించదు అంటూ అంబటి హెచ్చరించారు.