×
Ad

Minister Ambati Rambabu : పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు : మంత్రి అంబటి రాంబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు.

  • Published On : March 5, 2023 / 02:37 PM IST

rambabu

Minister Ambati Rambabu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కలలు కన్నది రాజశేఖర్ రెడ్డి అయితే.. పూర్తి చేసేది జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ద్రోహి విమర్శించారు. రాజకీయాల కోసం తాను చంద్రబాబును విమర్శించడం లేదని .. ఇది వాస్తవమన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఆ నాటి ప్రభుత్వానికి(టీడీపీ) లేదని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడం మానవ తప్పిదమన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని రాంబాబు పేర్కొన్నారు. టీడీపీది అవగాహనా రాహిత్యమన్నారు. దుర్మర్గామని, తెలివి తక్కువ తనమని మండిపడ్డారు.

Ambati Rambabu On Polavaram : దానిపై క్లారిటీ వచ్చాకే.. పోలవరం ఎప్పుటికి పూర్తవుతుందో డేట్ చెప్పగలం- మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసి.. ప్రజలకు నీళ్లిస్తాం తప్ప భజన చేసే వాళ్లం కాదని స్పష్టం చేశారు. భారీ వర్షంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. రిపేర్లు ఎలా చేయాలనేదానిపై సమీక్షిస్తున్నామని చెప్పారు.