Ambati Rambabu : చంద్రబాబు నిరాహార దీక్ష చూసి గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది : మంత్రి అంబటి

చంద్రబాబు అవినీతి డబ్బుతో జేఎస్పీ నడుస్తుందన్నారు. భూస్థాపితం అవుతున్న టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని చెప్పారు.

Minister Ambati Rambabu (1)

Ambati Rambabu – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నిరాహార దీక్ష చూసి గాంధీజీ ఆత్మ ఆత్మ క్షోభిస్తుందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు జైలులో ఉండి నిరాహార దీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. కాపులు ఉన్న చోటే పవన్ మీటింగ్స్ పెడుతున్నాడని తెలిపారు. కాపులను లాక్కునేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో యాత్ర చేయిస్తున్నారని ఆరోపించారు.

అవనిగడ్డలో టీడీపీ జేఎస్పీ కలిసి నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ కలవడం వల్ల కాపులు పవన్ సభకు రాలేదని చెప్పారు. టీడీపీతో కలిసి తప్పు చేశావని కాపులు తిప్పి కొట్టారని వెల్లడించారు. బీజేపీతో ఉన్నావా లేదా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అనైతికమైన వ్యక్తి అని ఘాటుగా విమర్శించారు.

Pawan kalyan : పవన్ కల్యాణ్ మౌన దీక్ష.. వైసీపీ ప్రభుత్వంతో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ నేతల చెవిలో పవన్ కళ్యాణ్ పెద్ద పువ్వులు పెట్టాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడన్నారు. ఇకపై జన సైనికులు కాదు.. సైకిల్ సైనికులు అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కాకపోతే టీడీపీకి ఎందుకు సపోర్టు చేస్తున్నాడని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి డబ్బుతో జేఎస్పీ నడుస్తుందన్నారు.

భూస్థాపితం అవుతున్న టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురూ ఓడిపోవడం ఖాయం అన్నారు. తమను పవన్ కాపాడేదేంటీ ఆయన పిచ్చి కాకపోతే అని చెప్పారు. పవన్ ఊహా ప్రపంచంలో ఉన్నాడని ఏదేదో మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.