Pawan kalyan : పవన్ కల్యాణ్ మౌన దీక్ష.. వైసీపీ ప్రభుత్వంతో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంబేద్కర్ ను రాజ్యాంగ కమిటీకి అద్యక్షుడిని చేసింది మహాత్మా గాంధీ. తనను విభేదించినాకూడా అంబేద్కర్ కు గాంధీ సముచిత స్థానం కల్పించారు.

Pawan kalyan : పవన్ కల్యాణ్ మౌన దీక్ష.. వైసీపీ ప్రభుత్వంతో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

pawan kalyan

Jana Sena party chief Pawan Kalyan : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు. మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపానికి వచ్చిన పవన్..జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు. పవన్ తో పాటు సంఘీభావంగా జనసేన నేతలు నాదెండ్ల మనోహర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. మౌన దీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.. మచిలీపట్నం లాంటి నేలపై గాంధీ జయంతి జరపడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బందర్ గొప్పతనం ఏంటంటే జనసేన అవిర్బావ సభలో జాతీయ గీతం రాగానే పది లక్షలమంది లేచి నిలబడ్డారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటుచేశాక గాంధీ జయంతిని మచిలీపట్నంలో జరుపుతామని పవన్ అన్నారు.

Read Also : వారి ఉజ్వల భవిష్యత్తుకోసం ఎంతవరకైనా వెళ్తాం.. అరవింద్ ట్వీట్ కు ప్రధాని మోదీ రియాక్షన్

మౌన దీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.. మచిలీపట్నం లాంటి నేలపై గాంధీ జయంతి జరపడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బందర్ గొప్పతనం ఏంటంటే జనసేన అవిర్బావ సభలో జాతీయ గీతం రాగానే పది లక్షలమంది లేచి నిలబడ్డారు. వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేశాక గాంధీ జయంతిని మచిలీపట్నంలో జరుపుతామని అన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంబేద్కర్ ను రాజ్యాంగ కమిటీకి అద్యక్షుడిని చేసింది మహాత్మా గాంధీ. తనను విభేదించినాకూడా అంబేద్కర్ కు గాంధీ సముచిత స్థానం కల్పించారు. నాకు వైసీపీ ప్రభుత్వం పాలసీలపై మాత్రమే విభేదం ఉంది.. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ మాదిరిగా కేసులు పెట్టి, జైలుకు పంపే ఆలోచన సరికాదు. జగన్ ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించాం అని పవన్ అన్నారు. జైజవాన్ జైకిసాన్ పిలుపునిచ్చిన వ్యక్తి లాల్ బహుదూర్ శాస్త్రి. ఆయన ప్రేరణతో భవిష్యత్ తరాలకు విలువలతో కూడిన రాజకీయాలతో జనసేన ముందుకెళ్తుందని పవన్ అన్నారు. ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో పార్టీ పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

Read Also : విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? వాళ్లకు బుర్రా బుద్దీ ఏమైంది..? ఢిల్లీలో లోకేశ్ దీక్ష

ఇదిలాఉంటే పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి విజయ యాత్ర ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన – టీడీపీ సంకీర్ణమే టీకా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి ప్రభుత్వమే వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నాడు.. కానీ, 15 సీట్లు వస్తే గొప్ప అంటూ పవన్ ఎద్దేవా చేశారు.