Anam Ramanarayana Reddy : మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అస్వస్థత… స్పీచ్ మధ్యలో ఘటన.. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో..

Minister Anam Ramanarayana Reddy : 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

Minister Anam Ramanarayana Reddy

Minister Anam Ramanarayana Reddy : 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభ వేదికపై మాట్లాడుతున్న ఈ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Also Read : CM Chandrababu Naidu : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే..!

ప్రసంగం సమయంలో మంత్రి ఆనంకు ఒక్కసారిగా బీపీ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి పక్కకు వాలిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీపీ డౌన్ కావడం వల్లనే ఇలా జరిగిందని, కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ప్రస్తుతం బీపీ నార్మల్ గా ఉందని వెల్లడించారు. ఇదిలాఉంటే.. మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.