Minister Botcha Satyanarayana: మీ పిల్లలకేనా ఇంగ్లీష్ మీడియం చదువులు.. పేదలకు వద్దా? పవన్ అవగాహనతో మాట్లాడాలి

బైజ్యూస్ లో పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పిస్తున్నాం. దానికి ఎవ్వరు డబ్బులు కట్టడంలేదు.. కట్టినట్లు నిరూపించండి అంటూ బొత్స సవాల్ చేశారు.

Botcha Satyanarayana: ఈనెల 26న ఇచ్చాపురం నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, వైసీపీ సామాజిక చైతన్య బస్సు యాత్ర ద్వారా ప్రజలకు జరిగిన మేలును వివరిస్తామని, వారికి మరింత దగ్గరవుతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ తనకంటూ ఓ ముద్రవేసే ఏ కార్యక్రమాన్ని చెయ్యలేదని బొత్స విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ నాలుగు సంవత్సరాల్లోనే విద్య, వైద్యం, పరిపాలన, పారిశ్రామిక రంగాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారని చెప్పారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తామని మంత్రి బొత్స అన్నారు. గతంలో చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్కటైనా అంశాన్ని నెరవేర్చారా? అంటూ బొత్స ప్రశ్నించారు.

Read Also : MLA Raja Singh: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. గోషామహల్ నుంచే మరోసారి బరిలోకి?

సీపీపీఎస్సీ రద్దు చేస్తామని చేప్పాము. కొన్ని రాజకీయ ఇతర ఇబ్బందులు వల్ల జీపీఎస్సీ ని తీసుకొచ్చామని, జీపీఎస్సీ ద్వారా వారికి న్యాయం జరుగుతుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చని, కానీ, చట్టానికి లోబడి నడుచుకోవాలని.. పుంగనూరులో ఏం జరిగిందో పూర్వపరాలు తెలుసుకోవాలని బొత్స అన్నారు. పవన్ కల్యాణ్ ఏదైనా మాట్లాడేముందు దానిగురించి అవగాహనతో మాట్లాడాలి.. లేదంటే దానికి సంబంధించి ట్యుషన్ చేపుతానంటూ బొత్స సూచించారు. బైజ్యూస్ లో పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పిస్తున్నాం. దానికి ఎవ్వరు డబ్బులు కట్టడంలేదు.. కట్టినట్లు నిరూపించండి అంటూ బొత్స సవాల్ చేశారు. బైజ్యూస్ వ్యవహారంలో సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేయమనండి అంటూ బొత్స సూచించారు. పేదలకు ఉన్నత ఇంగ్లీష్ విద్య అవసరం లేదా? మీ పిల్లలు మాత్రమే ఉన్నత చదువులు సిబీఎస్సీ ఇంగ్లీషు మీడియాలు చదవాలా? అంటూ బొత్స ప్రశ్నించారు.

Read Also : Tiger : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సెలబ్రిటీ పార్టీలకు గెలిచే అవకాశం లేదని బొత్స జోస్యం చెప్పారు. రైల్వేజోన్ విషయంలో మా తరపున బీజేపీ అధ్యక్షురాలని అడగమనండి అంటూ బొత్స సూచించారు. స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ విషయంపై కేంద్రాన్ని కలుస్తున్నాం. మా డిమాండ్స్ చేపుతున్నామని చెప్పారు. ఎంసెట్ మూడవ కౌల్సింగ్ చేస్తామని చేప్ఫలేదు. స్పాట్ అడ్మిషన్లో కొన్ని సీట్లు కేటాయించాం. అయితే మూడో కౌన్సిలింగ్ ఎర్పాటు చేయ్యాలని విద్యార్థులు కోరుతున్నారు. దానిని పరిశీస్తున్నాం అని బొత్స వివరణ ఇచ్చారు.

వైసీపీ చేపట్టే బస్సుయాత్రకు పోలీసుల అనుమతి తీసుకుంటామని చెప్పిన బొత్స.. వైసీపీ అధికారంలోకి వచ్చాకే సెక్షన్ 30 తీసుకురాలేదని, ఎప్పటి నుంచో ఆ సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. అయితే, ఒకచోట అనుమతి తీసుకొని మరోచోట తిరుగుతామంటే చట్టం ఒప్పుకోదని తెలుసుకోవాలని బొత్స ప్రతిపక్షాలకు సూచించారు. చంద్రబాబుసైతం అలానే చేసి అల్లర్లు సృష్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు