Tiger : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

పంట చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం రైతులను కలవపెడుతోంది. మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tiger : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

Tiger Halchal

Tiger Halchal – People Panic : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి లారీ డ్రైవర్లకు రోడ్డుపై పులి కనిపించింది. పెన్ గంగా నదికి అవతల చినార్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరించింది. భీంపూర్ మండలంలోని వడూర్, అర్లి-టి, అంతర్గాం గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇటీవల తాంసి-కె, గొల్లఘాట్ పరిసరాలను సందర్శించిన అటవీశాఖ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలోని టిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి వచ్చింది. నదిలో ప్రవాహ ఉద్ధృతి తగ్గడంతో తెలంగాణ వైపు ఆవాసం కోసం పులులు యత్నిస్తున్నాయి.

Tiger : మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

పంట చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం రైతులను కలవపెడుతోంది. మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పులులు సంచరిస్తూ పశువులను హతమార్చిన వైనం తెలిసిందే.