Minister Botsa : సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు- హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స

రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..

Minister Botsa : ఏపీ రాజధానిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) స్పందించారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రాజధానిపై చట్ట పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని ఆయన గుర్తుచేశారు.

దీనికి విరుద్ధంగా తీర్పు వచ్చిందని.. దీనిపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం లేదని భావిస్తున్నామన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన బొత్స.. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తామని చెప్పారు. రాజధాని అంటే ఓ సామాజిక వర్గం కాదన్నారు.

”రాజధాని అభివృద్ది అంశం సమయం, ఖర్చు, నిధులతో ముడిపడి ఉంది. అభివృద్ది విషయంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాం. ప్రస్తుతం సీఆర్డీఎ చట్టం అమల్లో ఉంది. దీన్ని డీవియేషన్ చేసి ఎలా ముందుకు వెళ్తాం. రాజధానిపై మా విధానం మాకు ఉంది. అభివృద్ది అనేది వ్యక్తుల కోసం కాదు…వ్యవస్థ కోసం చేయాలి. రాజధానిలో డెవలప్ మెంట్ చేస్తున్నాం. ఎక్కడా డీవియేట్ కావడం లేదు.

Minister Botsa Satya Narayana On AP Capital

అభివృద్ది వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం. దానికి కట్టుబడి ఉన్నాం. రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. రైతులకు సీఎం జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి. మేము ఎక్కడా రాజధాని భూములను ఇతర అవసరాల కోసం ఎక్కడా తనాఖా పెట్టలేదు. రాజధాని అభివృద్ది కోసమే రాజధానిలోని భూములను హడ్కోకు తాకట్టు పెట్టాం. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనాఖా పెట్టారు. శాసనసభ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో అనేది మీరే చూస్తారు” అని బొత్స(Minister Botsa) అన్నారు.

Konidela Nagababu : ఇప్పటికైనా ప్రజల రాజధాని నిర్మించాలి, ప్రజలతో శత్రుత్వం వద్దు- నాగబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని సర్కారుకు తేల్చి చెప్పింది.

రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును కోర్టు ఆదేశించింది.

Minister Botsa Satya Narayana On AP Capital

ఏపీ సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతో పాటు ఇంకొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ చట్టాలను సర్కారు రద్దు చేసింది. అయితే, మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినా తమకు ఇంకా కొన్ని అభ్యంతరాలున్నాయని, వాటిపై విచారణ చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను అమలు చేసేలా, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసిచ్చేలా చూడాలని కోరారు.

AP High Court on CRDA: హైకోర్టు తీర్పును స్వాగతించిన నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరి, ఇతరులు

అయితే, మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. దాఖలైన పిటిషన్లపై విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఫిబ్రవరి 4న వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. గురువారం వెలువరించింది.

ట్రెండింగ్ వార్తలు