AP Minister Botsa Satyanarayana : ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాక డీఎస్సీ -2024 వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తామని అన్నారు. ఈనెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఈనెల 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుందని తెలిపారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు.
Also Read : AP DSC Notification 2024 : మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..
మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించటం జరుగుతుందని అన్నారు. 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. https://cse.ap.gov.in వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Also Read : AP DSC: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి బొత్స
మొత్తం 122 సెంటర్లలో డీఎస్సీ నిర్వహిస్తామని, అభ్యర్థులు తమ సమస్యలను నివృత్తి చేసుకునేందుకు 9505619127 లేదా 9705655349 ను సంప్రదించవచ్చునని తెలిపారు. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల, ఏప్రిల్ 1న ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించడానికి గడువుగా నిర్ణయించడం జరిగిందని, ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులకు ప్రొబీషన్ డిక్లరేషన్ అనేది డబ్బు విషయం కాదు. వారికి శ్రద్ద వుండాలి, డెడికేషన్ గా పని చేయాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశ్యమని బొత్స చెప్పారు.