AP DSC: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి బొత్స

AP DSC: ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని కూడా బొత్స అన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.

AP DSC: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana

Updated On : April 21, 2023 / 2:22 PM IST

AP DSC: త్వరలో డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ ఇస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చెప్పారు. సీఎం వైఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇవాళ విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని  బొత్స తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అనేదే తమ పాలసీ అని స్పష్టం చేశారు. తాము డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు. అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారని ఆయన నిలదీశారు.

కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి? అని బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారని తెలిపారు. బిడ్డింగ్ తో ఆ విషయం స్పష్టమయిందని చెప్పారు. తాము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం అధీనంలోనే ఉండాలని చెబుతున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్ అని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశాన్ని పరిశీలిస్తన్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామన్న ప్రచారం తప్పని చెప్పారు. పరీక్షలు, ఒంటిపూట బడుల కారణంగా చిక్కీలు ఇస్తున్నామని తెలిపారు.

Andhra Pradesh : వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ : గంటా శ్రీనివాసరావు