Andhra Pradesh : వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ : గంటా శ్రీనివాసరావు

వైసీపీ ప్రభుత్వాం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు.

Andhra Pradesh : వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ : గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao.. Jagan,

Andhra Pradesh : వైసీపీ ప్రభుత్వానికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. పేర్లు మార్పులు కొసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర పర్యటలో సీఎం జగన్ విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను.. వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌గా మార్చడంపై తీవ్రంగా మండిపడ్డారు గంటా. ఇటీవల జీ20 సన్నాహక సదస్సు సందర్భంగా కోట్ల రూపాయలు కేటాయించి వ్యూ పాయింట్‌ను అభివృద్ది చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే వ్యూ పాయింట్‌ను అభివృద్ది చేసింది. అయితే సీత కొండగా ఉన్న వ్యూ పాయింట్‌ను అబ్దుల్ కలాం పేరుగా మార్చారు.

ఇలా గొప్ప్ వ్యక్తుల పేర్లు కూడా వైసీపీ ప్రభుత్వం మార్చుకుంటు పోతోందని ఇది ఆ వ్యక్తుల్ని అవమానపరచటమేనన్నారు గంటా. సీత కొండగా ఉన్న వ్యూ పాయింట్ ను వైఎస్సాఆర్‌గా నామకరణం చేయడంపై రాజకీయ రణం నడుస్తోంది. ఇలా పేర్లు మార్పు రాజకీయాలు వైసీపీ మానుకోవాలని హెచ్చరించారు. ఏదైనా అభివృద్ది చేసివాటినికి వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు..కానీ భారతదేశానికి పేరు తెచ్చిన గొప్ప వ్యక్తుల పేర్లను తొలగించి వైఎస్సార్ పేర్లు పెట్టటమేంటీ?ఇది జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఇటువంటి అహంకారపూరిత చర్యలకు పోతున్న జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని..రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు గంటా.