Minister Botsa Satyanarayana
Minister Botsa Satyanarayana : ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. అంగన్వాడీ అయినా మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒకటేనని చెప్పారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు 11 సమస్యలను ముందు ఉంచగా.. అందులో 10 సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించామన్నారు. ఆ మిగిలిన ఒక్కటి జీతాలను పెంచాలని కోరారని, అయితే ఎన్నికల ముందు జీతాన్ని పెంచడం భావ్యం కాదని భావించినట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఆ తరువాత కూర్చోని చర్చించుకుని ఏది కావాలంటే అది చేస్తామన్నారు. కానీ ఇప్పుడే చేయాలని పట్టుబడితే అది చాలా తప్పు అని అన్నారు. ఐదేళ్ల ప్రభుత్వంలో జీతాల పెంపు గురించి ఒకసారి మాత్రమే చూస్తుందన్నారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి చూడాలనేది ధర్మం కాదన్నారు. ఎంత ఇచ్చినప్పటికీ సరిపోదని, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. తాము వ్యతిరేకం కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స పేర్కొన్నారు.
Chandrababu Naidu: హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతేమో..: చంద్రబాబు
మున్సిపల్ కార్మికులు చెప్పిందల్లా చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని, అందుకనే ప్రతిపక్ష, కమ్యునిస్ట్ పార్టీలు చెప్పినట్టు చేస్తాం అంటే అది భావ్యం కాదన్నారు. సిద్ధాంతాలు, రాజకీయాలు తర్వాత చూసుకుందామన్నారు. ప్రజలు తాలూకా ఆరోగ్యంతో, ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం భావ్యం కాదన్నారు. ఇలా చేస్తే ప్రజలు హర్షించరని, కాబట్టి వెంటనే నిరసనలు విరమించుకుని విధుల్లో చేరాలని సూచించారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందన్నారు.