Chandrababu Naidu: హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతేమో..: చంద్రబాబు

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కదిలి రావాలని చెప్పారు. రాష్ట్రంలోని వ్యవస్థలను..

Chandrababu Naidu: హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతేమో..: చంద్రబాబు

Chandrababu Naidu

Updated On : January 7, 2024 / 8:32 PM IST

జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతేమో వెలవెలబోతుందని చెప్పారు.

వైసీపీ పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కదిలి రావాలని చెప్పారు. రాష్ట్రంలోని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని అన్నారు. వైసీపీ పాలనలో ఆక్వారంగం కుదేలైందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా కాలువల్లో పూడిక తీశారా? అని అన్నారు.

ఏపీలో అన్నింటి ఛార్జీలను పెంచేశారని చెప్పారు. వ్యవసాయ శాఖ మూతపడిందని చంద్రబాబు అన్నారు. అన్నదాతలు దగా పడ్డారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు.

ఇంకా ఏమన్నారు?

  • సామాజిక న్యాయం చేసే పార్టీ టీడీపీ
  • అధికారంలోకి వచ్చాక అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు ఇస్తాం
  • ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
  • ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి
  • ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం
  • పేదరిక నిర్మూలనే నా జీవిత ఆశయం