Andhra Pradesh : పయ్యావులవన్నీ అసత్య ఆరోపణలు-బుగ్గన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Buggana Comments On Payyavula

buggana rajendranath : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీఏసీ చైర్మన్ గా ఉన్న వ్యక్తికి ఏవైనా సందేహాలు ఉంటే మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని…. గౌరవంగా ప్రభుత్వాన్ని అడిగి వివరాలు తీసుకోవచ్చని అలా కాకుండా లేఖలు విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేశవ్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కోన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి బుగ్గన తెలిపారు. ఆడిట్ సంస్ధ అడిగిన వివరాలను పయ్యావుల భూతద్దంలో చూపించారని బుగ్గన చెప్పారు. గత ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ లో చేసిన తప్పులను సవరించుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపారు.