Chelluboyina Venugopal : సీఎం జగన్‌ను ఆరాధిస్తే అన్ని పనులు అయిపోతాయి- మంత్రి వేణుగోపాల్
జర్నలిస్టుల పనులు అయిపోవాలన్నా, వారికి ఇళ్లు కావాలన్నా.. చాలా గట్టిగా సీఎం జగన్ ను ఆరాధిస్తే చాలు అంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.
- Naveen
- Published On : April 12, 2022 / 07:42 PM IST
Chelluboyina Venugopal
Chelluboyina Venugopal : ఆరాధిస్తే చాలు అంతా అయిపోతుందని అంటున్నారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఎవరినైనా ఆరాధించాలే కానీ, వారి గురించి ఆరా తీయొద్దంటూ సలహాలు ఇస్తున్నారు. జర్నలిస్టుల పనులు అయిపోవాలన్నా, వారికి ఇళ్లు కావాలన్నా.. చాలా గట్టిగా సీఎం జగన్ ను ఆరాధిస్తే చాలు అంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఆరాధించడం ప్రకృతి ప్రసాదించిన వరం అని, మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే అన్ని పనులు అయిపోతాయంటున్నారు ఏపీ కొత్త మంత్రి. జగన్ ను ఆరాధిస్తే అన్ని పనులు అయిపోతాయి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Anil Kumar Yadav: సీఎం జగన్‌కు సైనికుడుగా పని చేస్తా
ఏపీలో తాజాగా మంత్రులుగా నియమితులైన వారు తమ చాంబర్లలోకి అడుగుపెట్టారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సరదాగా మాట్లాడుతూ.. సీఎం జగన్ ను మనస్ఫూర్తిగా ఆరాధించాలని జర్నలిస్టులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం తప్పకుండా పరిష్కరిస్తారని చెప్పారు.
Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్
“ఆరాధించండి… మీకు ఇళ్ల స్థలాలు వస్తాయి. అంతేకానీ ఆరా తీయకండి… అలా చేస్తే సరైన ఫలితాలు రావు” అని మంత్రి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల తనకు స్పష్టమైన అవగాహన ఉందని, జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.
