Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్

రైతులు పండించిన అన్నం తినేటప్పుడు కులం గుర్తుకురాదన్నా పవన్ కళ్యాణ్..అటువంటి రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్

Pawan

Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన స్థానికంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. అనంతరం రాప్తాడు మండలం మన్నీల గ్రామంలో రచ్చబండ కార్యాక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్..రైతుల ఆత్మహత్యలపై అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే లిస్ట్ ప్రభుత్వం దగ్గర లేదన్న పవన్ కళ్యాణ్ ఆ జాబితా జనసేన దగ్గరుందని..రైతులను ప్రభుత్వం ఏ స్థాయిలో విస్మరించిందో ఇదే నిదర్శనమని పవన్ మండిపడ్డారు. “నేను రైతు నేపథ్యం నుంచి వచ్చిన వాణ్ని, రెండు మూడు ఎకరాలలో వ్యవసాయం చేసిన వాణ్ని..రైతు కష్టాలు తెలిసిన వాణ్ని కాబట్టే రైతులను ఆదుకోవాడానికి ముందుకొచ్చా తప్పా రాజకీయం చేయటానికి కాదు” అని పాన్ వ్యాఖ్యానించారు. ప్రజల అబిమానంతో సినిమాల్లో కష్టపడి పనిచేస్తే డబ్బులు వచ్చాయని..ఆ డబ్బులు నాపిల్లలకు దాచిపెట్టాలని లేదని పవన్ చెప్పుకొచ్చారు.

Also read:AP Covid List : ఏపీలో కొత్తగా 02 కరోనా కేసులు నమోదు

రైతులు పండించిన అన్నం తినేటప్పుడు కులం గుర్తుకురాదన్నా పవన్ కళ్యాణ్..అటువంటి రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తాను ఇంటర్ చదివేటప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్న పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కాపాడాడని..ఆనాటి నుంచి ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారంటే తనకు చాలా బాదేస్తుందని చెప్పుకొచ్చారు. ఈరోజు లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోబోమని..బాధిత రైతుల పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. అసీనా పోలీస్ ఆఫీసర్ కావాలకుంటే ఆమె చదువుకయ్యే ఖర్చు నేను భరిస్తానని పవన్ తెలిపారు. తనను టీడీపీ దత్తపుత్రుడంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తూ..అధికార వైసీపీ నాయకులలో కొందరు ముఖ్య నేతలను త్వరలోనే సీబీఐ దత్తత తీసుకోనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం వైసీపీ చేసే కుట్రలపై తనకు భయం లేదన్న పవన్ కళ్యాణ్..దెబ్బ పడేకొద్దీ రాటుదేలుతానని అన్నారు.

Also read:Ambati Rambabu : వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను-అంబటి రాంబాబు

వైసీపీ ప్రభుత్వం పోలీసులను వాడుకొని వదిలేస్తుందని ఆరోపించిన పవన్ కళ్యాణ్..ప్రభుత్వం చేసే తప్పిదాలకు పోలీసులు బలి కావొద్దని హితవు పలికారు. పోలీసుల కష్టాలు ఒక పోలీస్ బిడ్డగా తాను అర్ధం చేసుకుంటానని..పోలీసులు ప్రజల పక్షాన నిలబడాలని పవన్ అన్నారు. ఆంద్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతానికీ పరిశ్రమలు రావాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ యువత అందరికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవిదంగా జనసేన కృషిచేస్తుందని అన్నారు. ఇక్కడ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకకు పోకూడదని పవన్ పేర్కొన్నారు. రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేంత వరకు జనసేన ముక్కుపిండి వసూలు చేస్తుందని, కౌలు రైతులకు కౌలు దారుల గుర్తింపు కార్డులు వచ్చేంత వరకు జనసేన పోరాడుతుందని పవన్ తెలిపారు. “మేము అధికిరంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని, మీ కష్టాలు తీరుస్తామని” పవన్ అన్నారు. “నేను పోరాడుతున్న మీలో కూడి ఓ పది మంది పోరాడాలని కోరుతున్నా. కష్టాల్లో ఉన్నవారికి మేమున్నామనే భరోసా జనసేన నాయకులు, కార్యకర్తలు అందించాలి” అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Also read:Bandi Sanjay On Tickets : పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఎన్నికల్లో టికెట్లు-బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు