Ambati Rambabu : వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను-అంబటి రాంబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు  నాయకుల్లో ఉన్న అసంతృప్తిని టీకప్పులో తుపానుతో పోల్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ రోజు కడపలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.

Ambati Rambabu : వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను-అంబటి రాంబాబు

Minister Ambati Rambabu

Updated On : April 12, 2022 / 5:15 PM IST

Ambati Rambabu :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో   కొందరు  నాయకుల్లో ఉన్న అసంతృప్తిని టీకప్పులో తుపానుతో పోల్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ రోజు కడపలో   పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రానికి మణిహారం లాంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
పోలవరంతో పాటు రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని అంబటి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారి కల అని ఆయన అన్నారు.

మంత్రి పదవి కోల్పోయిన వారికి… ఆశించి రాని వారికి అసంతృప్తి అనేది ఉంటుందని అంబటి వ్యాఖ్యానించారు. అసంతృప్తిని వ్యక్తం చేయడంలో తప్పు చేస్తే మాత్రం ఎవరు క్షమించరని ఆయన అన్నారు. రాబోయే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సీఎం జగనే ఉంటారని రాంబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు రానివారికి రానున్న రోజుల్లో సీఎం జగన్ మంత్రి పదవులు ఇస్తారని చెప్పారు.

నాయకుడిని మెప్పించి పదవులు తెచ్చుకోగలరు గాని.. నాయకుని నొప్పించి పదవులు తెచ్చుకోలేరని అంబటి రాంబాబు చెప్పారు. ఈ సూత్రాన్ని అసంతృప్తులు గమనించాలన్నారు.
Also Read : Tirumala : తిరుమ‌ల‌లో ఇద్ద‌రు దళారులపై కేసు న‌మోదు