Anil Kumar Yadav: సీఎం జగన్‌కు సైనికుడుగా పని చేస్తా

ఏపీ ప్రభుత్వం కొత్త కేబినెట్ దిశగా అడుగులేస్తూ.. పాత మంత్రులను రాజీనామా చేయాలని కోరింది. అలా పాత మంత్రులు మాజీలు అయిపోయినప్పటికీ సీఎం మాటను వేదంగా భావిస్తూ.. తమ పని తాము చేసుకుని..

Anil Kumar Yadav: సీఎం జగన్‌కు సైనికుడుగా పని చేస్తా

Anil Kumar Yadav

Updated On : April 12, 2022 / 1:17 PM IST

Anil Kumar Yadav: ఏపీ ప్రభుత్వం కొత్త కేబినెట్ దిశగా అడుగులేస్తూ.. పాత మంత్రులను రాజీనామా చేయాలని కోరింది. అలా పాత మంత్రులు మాజీలు అయిపోయినప్పటికీ సీఎం మాటను వేదంగా భావిస్తూ.. తమ పని తాము చేసుకుని పోతామని చెప్తున్నారు. మరికొందరిలో అసంతృప్తి కనబడుతున్నా.. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి మాజీ మంత్రులు తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సీఎం జగన్ ఆదేశాల మేరకు సైనికుడిలా పనిచేస్తానని చెప్తున్నారు.

“2019 ఎన్నికల తర్వాత బీసీ మంత్రిగా అవకాశం కల్పించారు. అప్పుడే రెండున్నరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. జగన్ కు సైనికుడుగా పని చేస్తా. మూడేళ్లపాటు గొప్ప శాఖను నాకు అప్పగించారు. దానికి తగినట్లుగా పని చేశాం. నెల్లూరు జిల్లా నుంచి మొదటి బీసీ మంత్రిగా సేవలందించాను”

“ఈ క్రమంలో నాకు సహకరించిన ఎం.ఎల్.ఏ.లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. గౌతమ్‌తో కలిసి పొరపొచ్చాలు లేకుండా పనిచేశాం. మంత్రిగా ఉన్నపుడు ప్రజలను కలవడం కుదరలేదు. ఈ రెండేళ్లు ప్రజలకు మరింత చేరువగా ఉంటా. ఏదయినా నేరుగానే తలపడతా” అంటూ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

Read Also: మంత్రి పదవి రానందుకు బాధ లేదు..వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా : మాజీ హోంమంత్రి సుచరిత