Jogi Ramesh : లోకేష్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే : మంత్రి జోగి రమేష్

చంద్రబాబు అరెస్టుతోనే నిజం గెలిచిందన్నారు. నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైలులో ఉన్నాడని పేర్కొన్నారు.

Jogi Ramesh

Jogi Ramesh Sensational Comments : చంద్రబాబు, లోకేష్ పై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. అవినీతి చేయడంలో చంద్రబాబు అపరమేధావి అని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసింది రాజకీయం కాదు వ్యాపారమేనని, లక్షల కోట్ల రూపాయలు కూడగట్టాడని ఆరోపించారు. రూ.17 లక్షల కోట్ల బడ్జెట్ లో చంద్రబాబు 10 శాతం అయినా నొక్కేసి ఉంటాడని విమర్శించారు. దమ్ముంటే మీ ఆస్తులపై సీబీఐ విచారణ కోరే సత్తా ఉందా అని లోకేష్ కి సవాల్ విసిరారు.

చంద్రబాబు అరెస్టుకు ప్రజల నుండే కాదు సొంత కార్యకర్తల నుండీ స్పందన లేదన్నారు. చంద్రబాబు అందరివాడు కాదని కొందరి వాడేనని నిరూపణ అయ్యిందని తెలిపారు. చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గం తప్ప వేరే ఎవరూ మద్దతు ఇవ్వలేదన్నారు. లోకేష్ అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 160 సీట్లు ఎలా గెలుస్తావు అని ప్రశ్నించారు. లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడా అని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత వీళ్లంతా ఇంట్లో కూరగాయలు కోసుకోవాలని ఎద్దేవా చేశారు.

Also Read: నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర : నారా లోకేశ్

భవిష్యత్తుకి గ్యారెంటీ లేని వాళ్లంతా ప్రజల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ వయసు ఎంతని, ఇందిరాగాంధీని అసలు చూశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతోనే నిజం గెలిచిందన్నారు. నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైలులో ఉన్నాడని పేర్కొన్నారు.  ఏపీ హేట్స్ జగన్ అని పుస్తకం వేస్తే ప్రజలు నమ్మరని తెలిపారు.

ఐదు కోట్ల ప్రజలు జగన్ కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటే పవన్ కళ్యాణ్ కి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఏదైనా పల్లెటూరికి వెళ్లి చూడు పేద పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పెత్తందారులకు పవన్ కళ్యాణ్ పాలేరులా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. పేద పిల్లలు చదువుకోకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నారేంటని మండిపడ్డారు.