Jagan Govt: దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన యజ్ఞ కార్యక్రమం మూడవ రోజుకు చేరిందని ఎపి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. నాలుగు ఆగమనలు, వేదాల ప్రకారం యాగశాలలో అనుకున్న దానికన్నా రిత్వికులు చాలా బాగా నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. 550 మంది రిత్వికుల ద్వారా యాగాన్ని నిర్వహిస్తున్నామని, అందుబాటులో మరో వంద మంది రిత్వికులు ఉన్నారని అన్నారు. ఆదనంగా ఉన్న 100 మంది రిత్వికులు ఇతర సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
BJP: వారి ఆటకట్టించడానికే హిందూ ఏక్తా యాత్ర: బండి సంజయ్
ఈ విషయమై మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఉదయం 5.30 గంటల నుంచి 8.30 వరకు ఒక షిఫ్ట్, 8.30 నుంచి 12.30 గంటల వరకు రెండవ షిఫ్ట్ ద్వారా యజ్ఞ క్రతువుని నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో పూజ కార్యక్రమలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా నిర్వహించాము. కోలాటాలు, నృత్యాల మధ్య యాగం చేస్తున్నాము. ఆవు నెయ్యిని రాజ్యస్థాన్ నుంచి తెప్పించాము.
Kakinada Road Accident : కాకినాడ జిల్లా తాళ్లరేవు రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య
ఈ యజ్ఞాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు, లోకకళ్యాణార్ధం నిర్వహిస్తున్నాం. ప్రధాన దేవాలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. పూర్ణాహుతి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాజ శ్యామలాదేవికి చేసిన కుంకుమ పూజలోని కుంకుమ, పసుపు, గాజులని ప్రసాదంగా భక్తులకు అందజేస్తాం. మానస సరోవరం నుంచి గంగా జలాన్ని తెప్పించి అమ్మవారికి అభిషేకం రేపు నిర్వహిస్తాం. వివిధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు రేపు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి చేసిన సంకల్పం విజయవంతం అవుతుంది’’ అని అన్నారు.