Kakinada Road Accident : కాకినాడ జిల్లా తాళ్లరేవు రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య

Kakinada Road Accident :ఆటోలో ప్రయాణిస్తున్న వారు యానాం చుట్టపక్కల చిన్నచిన్న గ్రామాలకు చెందిన వారు. ఆటోలో 14మంది ప్రయాణం చేయడంపై దర్యాప్తు చేస్తున్నాం.

Kakinada Road Accident : కాకినాడ జిల్లా తాళ్లరేవు రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య

Kakinada Road Accident(Photo : Google)

Tallarevu Road Accident : కాకినాడ జిల్లా తాళ్లరేవులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 8కి చేరింది. స్పాట్ లోనే ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీమంత్రి కురసాల కన్నబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, యానాం ఎమ్మెల్యే అశోక్ పరామర్శించారు.

కన్నబాబు..
ప్రమాదం జరగడం బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాము. ఈ ప్రమాద విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళాం. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నాము. పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించినప్పటికీ ప్రమాదం మన పరిధిలో జరిగింది కాబట్టి ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుంది.

Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

యానాం ఎమ్మెల్యే అశోక్..
ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. బాధితులకు పుదుచ్చేరి ప్రభుత్వం అండగా ఉంటుంది. పుదుచ్చేరి సీఎం దృష్టికి తీసుకెళ్లాం. బాధిత కుటుంబాలను అందర్నీ ఆదుకుంటాం.

కాకినాడ ఎస్పీ సతీష్..
ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. యానాం నుండి హైదరాబాద్ బస్సు.. రొయ్యల ఫ్యాక్టరీ నుండి ఆటోలో వస్తున్న మహిళలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు యానాం చుట్టపక్కల చిన్నచిన్న గ్రామాలకు చెందిన వారు. ఆటోలో 14మంది ప్రయాణం చేయడంపై దర్యాప్తు చేస్తున్నాం.

Also Read..Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ మహిళలే. ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.