Nara Lokesh: అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం కొనసాగింపు ఉండాలి, పార్టీ లేకుండా చేస్తామన్నారు అడ్రస్ లేకుండా పోయారు- నారా లోకేశ్

అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.

Nara Lokesh: కడప మహానాడులో మంత్రి నారా లోకేశ్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. టీడీపీని లేకుండా చేస్తామన్నారు.. చివరికి అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు లోకేశ్.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం కొనసాగింపు ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం కొనసాగింపు ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు. కార్యకర్తల కోసం ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు లోకేశ్. ప్రజల కోసమే చంద్రబాబు జీవితం అని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని నినదించారు నారా లోకేశ్.

Also Read: టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులు ఎవరు? ఖబర్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..

”మాస్ మహానాడు జాతర అదిరింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది. 2024 ఎన్నికల విజయం అల్ టైమ్ రికార్డ్. పార్టీ లేకుండా చేస్తామన్నారు.. అడ్రస్ లేకుండా పోయారు. సీబీఎన్ అంటే డెవలప్ మెంట్. సీబీఎన్ అంటే మన ధైర్యం. రాయలసీమ డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నాం. సీనియర్లని జూనియర్లని సమానంగా చూస్తా. పని చేసే వాళ్ళను ప్రోత్సహిస్తా. అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.

అందరూ రెడ్ బుక్ అంటే ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపులు? ఎర్ర బుక్ అంటే ఒకరికి గుండెపోటు, మరొకరు బాత్ రూమ్ లో కిందపడ్డారు. ఇంకొకరు ఏమయ్యారో మీకందరికీ తెలుసు. మహానాడులో తెచ్చిన ఆరు శాసనాలే మన శ్వాస” అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

 

”వైసీపీ నేతలు టీడీపీ జెండా పీకేస్తామన్నారు. పార్టీ లేకుండా చేస్తామన్న వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు. మద్యం స్కామ్ తో ప్రజా ధనాన్ని లూటీ చేశారు. జే బ్రాండ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. రాష్ట్రం కోసం కూటమి పార్టీలు జెండాలు పక్కన పెట్టి పని చేశాయి. 94 శాతం స్ట్రైక్ రేట్ గెలిచాం. కడపలో టీడీపీ జెండా రెపరెపలాడింది. కార్యకర్తే మా అధినేత. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు చేపడుతున్నాం. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు. అభివృద్ధి వికేంద్రీకరణ మన అజెండా. సీబీఎన్ అంటే సంక్షేమం, చంద్రబాబు అంటే ట్రెండ్ సెట్టర్. ఏపీ అభివృద్ధికి ప్రధాని అన్ని విధాలుగా సహకరిస్తున్నారు” అని లోకేశ్ చెప్పారు.