గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంకా అనేకచోట్ల పంపిణీ ప్రారంభించలేకపోయాం : మంత్రి రామానాయుడు

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కొవ్వూరు, రాజమండ్రి పరిసరాల్లోనే గోదావరి ఇసుక పాయింట్లు అత్యధికంగా

Minister Nimmala ramanaidu

Nimmala Rama Naidu: ప్రజలు ట్రాక్టర్లలో స్వయంగా ఉచితంగా ఇసుకను తరలించుకోవచ్చునని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో వాడపల్లి ఇసుక ర్యాంపును పరిశీలించారు. గోదావరి తీరాన ఇసుక ఉచిత విక్రయాలు పరిశీలించారు. బోట్స్ మెన్ సొసైటీ ద్వారా గోదావరి ఇసుక తవ్వకాల విధానంపై మంత్రి ఆరా తీశారు. మంత్రితోపాటు ఇసుక ర్యాంపులను పరిశీలించిన వారిలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. ఇసుక విధానంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బోట్స్ మెన్ సొసైటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది.

Also Read: Kethireddy Venkatarami Reddy: వైఎస్ షర్మిళ, విజయమ్మపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కొవ్వూరు, రాజమండ్రి పరిసరాల్లోనే గోదావరి ఇసుక పాయింట్లు అత్యధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంకా అనేక చోట్ల ఇసుక పంపిణీ ప్రారంభించలేక పోయాం. గోదావరి ఇసుక డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేయలేక పోతున్నట్లు తెలిసింది. తక్షణమే ఆన్ లైన్ మాత్రమే కాకుండా ఆఫ్ లైన్ బుకింగ్ కూడా పెట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించా. కొవ్వూరులో బోట్స్ మెన్ సొసైటీ సమస్య పరిష్కరిస్తాం. ట్రాక్టర్లలో ప్రజలు స్వయంగా ఉచిత ఇసుక తరలించుకోవచ్చునని మంత్రి పేర్కొన్నారు.