×
Ad

Politics In YCP : వైసీపీలో విభేధాలు..మంత్రి పెద్దిరెడ్డి పోస్టర్లు చింపేసిన సొంతపార్టీ కార్యకర్తలు

వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఏదో చోటామోటా నాయకుల మధ్యకాదు ఏకంగా మంత్రివర్గంలో ఉన్నవారే ఆధిపత్య ధోరణులకు పోతుంటే అధిష్టానానికి తలనొప్పిగా మారారు. వైసీపీ నేతల్లో విభేధాలు తారాస్థాయికి చేరుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో బయటపడింది. జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి,ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గాల మధ్య ఉన్న వర్గపోరు భగ్గుమంది.

  • Published On : December 15, 2022 / 01:16 PM IST

Politics In YCP

Politics In YCP : వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఏదో చోటామోటా నాయకుల మధ్యకాదు ఏకంగా మంత్రివర్గంలో ఉన్నవారే ఆధిపత్య ధోరణులకు పోతుంటే అధిష్టానానికి తలనొప్పిగా మారారు. వైసీపీ నేతల్లో విభేధాలు తారాస్థాయికి చేరుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో బయటపడింది. జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఉన్న వర్గపోరు భగ్గుమంది. నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యే క్రమంలో నేతలమధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

AP politics : తాడేపల్లిలో గన్నవరం పంచాయితీ..వల్లభనేని వంశీ..దుట్టా రామచంద్రరావులను పిలిపించిన సీఎం జగన్

మంత్రి పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం చించివేసింది. పెద్దిరెడ్డి వర్గం ఆయన ఫ్లెక్సీలను మడకశిరలో ఏర్పాటు చేసింది. పట్టణంలోని చైరస్తాల్లో లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. తిప్పేస్వామి వ్యతిరేకవర్గం ఈ పనికి పాల్పడిందని అంటున్నారు పెద్దిరెడ్డి వర్గీయులు. ఈక్రమంలో మడకశిరకు చేరుకున్న పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వర్గీయులు. దీంతో పెద్దిరెడ్డి మండిపడ్డారు.

దీనికి ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు కూడా ఏమాత్రం తగ్గలేదు. అలా అటు పెద్దిరెడ్డి వర్గీయులు ఇటు ఎమ్మెల్యే వర్గీయులు విడిపోయి మంత్రికి స్వాగతం పలికారు. రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మంత్రికి వేర్వేరు ప్రాంతాల్లో స్వాగతం పలకడంతో స్థానికంగా వైసీపీ నేతల్లో ఎంతటి సామరస్యం ఉందో తెలుస్తోంది. ఇది పార్టీకి మంచిదికాదని అందరు కలిసిమెలిసి పనిచేయాలని సూచనలు ఉన్నా నేతల మధ్య ఉన్న విబేధాలు ఇటువంటి సందర్భాల్లో బయటపడుతున్నాయి.

Also read : గన్నవరం పొలిటిక్స్…శుభవార్త చెబుతానన్న దట్టు రామచంద్రారావు ? ఎమ్మెల్యే అభ్యర్థా ?