Pinipe Viswarup : అధికారంలో వచ్చాక కొత్త జిల్లాలపై పున: సమీక్ష చేస్తామనటం బాబు భ్రమే- మంత్రి విశ్వరూప్

టీడీపీ అధికారంలోకి వచ్చాక నూతన జిల్లాల నిర్ణయం పై పునః సమీక్ష చేస్తామనటం వారి భ్రమ మాత్రమే అన్నారు. కాపు కార్పొరేషన్ లో నిధుల..

Pinipe Viswarup

Pinipe Viswarup : ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈ క్రమంలో ఎవరి పదవి ఉంటుంది? ఎవరి పదవి ఊడుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉంటే.. సీఎం జగన్ ఆదేశిస్తే.. రేపే తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి విశ్వరూప్ చెప్పారు. తమకు ఎటువంటి అసంతృప్తి లేదని, చాలా సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు. మాకన్నా మంచి టీమ్ వస్తుందని భావిస్తున్నాం అన్నారు. పార్టీలో బాధ్యతలు నిర్వహించటానికి ఎప్పుడూ రెడీగా ఉంటానని విశ్వరూప్ తేల్చి చెప్పారు.

కోనసీమ జిల్లాలో దళితులు ఎక్కువగా ఉంటారని, వారంతా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ అన్నారు. అన్ని చోట్లా ఇటువంటి డిమాండ్స్ వస్తాయనే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నూతన జిల్లాల నిర్ణయం పై పునః సమీక్ష చేస్తామనటం వారి భ్రమ మాత్రమే అన్నారు. కాపు కార్పొరేషన్ లో నిధులు దుర్వినియోగం అయ్యాయని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు.(Pinipe Viswarup)

Andhra Pradesh : 13 కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్

విదేశీ విద్య పేరుతో విదేశాలకు వెళ్లిన 700 మందికి సంబంధించిన ఆధారాలు లభ్యం కావటం లేదన్నారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయిందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 50 కోట్లకు పెంచామని మంత్రి విశ్వరూప్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకం మొదలైంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర విభజ తర్వాత ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 26 జిల్లాలతో రాష్ట్రం కొత్త రూపు దిద్దుకుంది. అంతేకాదు కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి.(Pinipe Viswarup)

సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అని సీఎం జగన్ తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

కాగా, కొత్త జిల్లాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని, రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Govt: కొత్త జిల్లాల ఏర్పాటు.. రిజిస్రేషన్ చార్జీలు పెంచిన ప్రభుత్వం!

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం తీరుపై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం మండిప‌డ్డారు. ప్ర‌జాభిప్రాయాన్ని ప‌రిగ‌ణించ‌కుండా జిల్లాల విభ‌జ‌న ఎలా చేస్తారని ఆయ‌న నిల‌దీశారు. పాల‌కుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్తే రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటని ఆయ‌న ప్ర‌శ్నించారు.

లోప‌భూయిష్టంగా ఏపీలో జిల్లాల విభ‌జ‌న చేశార‌ని పవన్ ఆరోపించారు. కొత్త జిల్లాల డిమాండ్ ఉన్న ప్రాంతాల‌పై ప్ర‌భుత్వం అధ్య‌య‌నం కూడా చేయించ‌లేద‌ని ఆయ‌న మండ‌పడ్డారు. ఏపీలోని ముంపు మండ‌లాల గిరిజ‌నుల‌కు ఈ తీరుతో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని చెప్పారు. పేద‌లు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్ర‌యాణించాల్సిన అవ‌స‌రం ఉండ‌కూడ‌ద‌ని అన్నారు.