AP Govt: కొత్త జిల్లాల ఏర్పాటు.. రిజిస్రేషన్ చార్జీలు పెంచిన ప్రభుత్వం!

అడ్డంకులు ఎన్ని వచ్చినా.. అభ్యంతరాలు ఎన్ని వినిపించినా ఏపీ ప్రభుత్వం మాత్రం అనుకున్నది చేసేసింది.

AP Govt: కొత్త జిల్లాల ఏర్పాటు.. రిజిస్రేషన్ చార్జీలు పెంచిన ప్రభుత్వం!

Ap Govt (2)

AP Govt: అడ్డంకులు ఎన్ని వచ్చినా.. అభ్యంతరాలు ఎన్ని వినిపించినా ఏపీ ప్రభుత్వం మాత్రం అనుకున్నది చేసేసింది. సోమవారం నుండి అధికారికంగా కొత్త జిల్లాల ఏర్పాటు కార్యకలాపాలను మొదలు పెట్టింది. అధికారికంగా ఈ జిల్లాల ఏర్పాటు మొదలు పెట్టడం.. అనంతరం కొద్ది గంటల్లోనే భూముల మార్కెట్‌ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీల వడ్డన కూడా మొదలు పెట్టింది. కొన్ని జిల్లాకేంద్రాలు, శివార్లలో మార్కెట్‌ విలువను పెంచుతూ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

AP Govt: బ్రేకింగ్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల రద్దు!

పాత జిల్లా కేంద్రాల సంగతి ఎలా ఉన్నా.. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, శివారు ప్రాంతాలలో భూముల మార్కెట్ ధరలు పెంచేసింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పడిన 11 కొత్త జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువ పెరిగింది. ఈ పెంపు కూడా బుధవారంనుంచి అమలుకానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సహజంగానే ఆయా ప్రాంతాలలో స్థిరాస్తి రంగం పుంజుకుంటుంది. దీన్ని క్యాష్ చేసుకొనేందుకు, ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

AP Govt Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్‌ 1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

భూముల మార్కెట్ విలువ పెంపుతో కొనుగోలుదారులపై ఆర్థిక భారం పెరగనుండగా.. అసలే కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి కొత్త జిల్లాలోని రేణిగుంట, కొత్త జిల్లాకేంద్రం అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, నరసరావుపేట, నంద్యాల, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాలలో పెరిగిన చార్జీలు అమలు కాబోతున్నాయి.