AP Govt: బ్రేకింగ్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2156 మందిని ఉద్యోగాల నుండి తొలగించిన ప్రభుత్వం..

AP Govt: బ్రేకింగ్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల రద్దు!

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2156 మందిని ఉద్యోగాల నుండి తొలగించిన ప్రభుత్వం ఈనెల 31తో వీరి సేవలు ముగుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ కోసం గతంలో ఏపీ ప్రభుత్వం స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను సృష్టించి వీరిని నియమించుకుంది.

AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు

2020 జనవరి నుండి ఈ స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుండగా.. రాష్ట్రాల సరిహద్దులు, మొబైల్ యూనిట్లు, వివిధ చెక్ పోస్టుల వద్ద అక్రమ రవాణాపై దృష్టిపెట్టి తనిఖీలు నిర్వహించే వారు. కాగా.. ఈ మార్చి 31తో ఇక రాష్ట్రంలో స్పెషల్ ప్రొటక్షన్ అధికారులు సేవలు ముగిసిపోనున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఒకేసారి ఉద్యోగాల నుండి తొలగించనుండడంతో ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Heat Wave Warning : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న భానుడు..!

జిల్లా ఎస్‌పీల స్థాయిలో జరిగిన ఈ నియామకాల్లో ఎక్స్ సర్వీస్‌మెన్, రిటైర్డ్ పారామిలిటరీ దళాలు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోం గార్డులుగా పనిచేసినవారు, పేరుపొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెక్యూరిటీ గార్డుగా శిక్షణ పొందినవారిని నియమించాలని, ఒకవేళ వీరిలో ఎవరూ అందుబాటులో లేకపోతే ఫిజికల్ టెస్ట్ ద్వారా అర్హులను ఎంపిక చేయాలనీ అప్పుడు నిబంధనలు ఉన్నా అధికంగా ఇందులో యువకులే కనిపించారు. మరి ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటన్నది చూడాలి.