AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు

పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు

Strike

AP government employees on strike : ఏపీలో కొత్త పీఆర్సీ జీవోలపై వివాదం నెలకొంది. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకూ తగ్గేది లేదంటున్న ఉద్యోగసంఘాలు… ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఇప్పటికే ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్టు ప్రకటించాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పీఆర్సీపై ధర్నాలు, ర్యాలీలు చేపట్టనున్నారు. ఉద్యోగుల సమ్మెకు ప్రజారోగ్య సంఘం మద్దతు తెలిపింది.

పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో… 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ దాని అనుబంధ అంశాల మీద అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని ప్రధానంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్‌మెంటట్‌, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు అమలు చేయాలని కోరుతున్నారు.

AP Government : ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

గతంలో సీఎం వైఎస్.జగన్‌ హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఇప్పటివరకు ప్రభుత్వం 12 సార్లు చర్చలు జరిగాయి. గ్రామ, వార్డు ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపచేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ఇక అన్ని డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర అలవెన్స్‌లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని స్టీరింగ్ కమిటీని జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ ఆహ్వానించారు.

Corona New Cases: భారత్‌కు ఊరట.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

అయితే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలా? వద్దా అనే దానిపై కాసేపట్లో స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై సమాలోచనలు జరపనుంది. మంత్రుల కమిటీ వద్దకు వెళ్లి జీవోలపై రివ్యూ చేయాలని స్టీరింగ్ కమిటీ కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.