Minister Roja: ఇంకా ఆస్పత్రిలోనే మంత్రి రోజా.. కొనసాగుతున్న చికిత్స..

వెన్నునొప్పి, కాలు వాపుతో శుక్రవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మంత్రి రోజాకు వైద్య చికిత్స కొనసాగుతుంది.

Minister Roja

Minister Roja: అనారోగ్యం కారణంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా గత శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. ఆమె షడన్‌గా ఆస్పత్రిలో చేరడంతో ఏమైందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో, ఆమె అభిమానుల్లో వ్యక్తమైంది. అయితే, రోజా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండురోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్లుగా తెలిసింది.

Minister Roja : చంద్రబాబు, పవన్ కల్యాణ్‎కు రోజా ఛాలెంజ్

మంత్రి రోజా కొద్దిరోజులుగా సయాటికా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. వెన్నునొప్పి, కాలు వాపుతో శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మంత్రి రోజాకు వైద్య చికిత్స కొనసాగుతుంది. గతంలో ఈ సమస్యపైనే ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Pawan Kalyan : అన్నవరానికి పవన్ కల్యాణ్.. వారాహి యాత్రకు సర్వం సిద్ధం

ఇప్పుడు  మళ్లీ ఆ నొప్పి తీవ్రం కావడంతో ఇంటివద్దే ఉంటూ ఫిజియోథెరపీ చేయించుకున్నారు. అయినా నొప్పితగ్గకపోవటం, కాలువాపు రావడంతో శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఈనెల ఏడో తేదీన విజయవాడలో జరిగిన మంత్రి వర్గం సమావేశానికి రోజా హాజరు కాలేదు.