Pawan Kalyan : అన్నవరానికి పవన్ కల్యాణ్.. వారాహి యాత్రకు సర్వం సిద్ధం

Pawan Kalyan : రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan : అన్నవరానికి పవన్ కల్యాణ్.. వారాహి యాత్రకు సర్వం సిద్ధం

Pawan Kalyan (Photo : Twitter, Google)

Updated On : June 13, 2023 / 12:22 AM IST

Pawan Kalyan – Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా రేపు (జూన్ 13) సాయంత్రానికి అన్నవరం చేరుకోనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కాగా, రత్నగిరి కొండపై భక్తుల రద్దీ ఉంది. దీంతో సత్యగిరి కొండపై పల్లవి గెస్ట్ హౌస్ లో రేపు రాత్రికి పవన్ బస చేయనున్నారు.

ఎల్లుండి ఉదయం రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్ కల్యాణ్. పూజలు అనంతరం తిరిగి గెస్ట్ హౌస్ చేరుకోనున్నారు జనసేనాని. ఎల్లుండి సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, పవన్ టూర్ కి సంబంధించి సమాచారం మాత్రమే ఇచ్చారని మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ కావాలని పోలీసులు కోరుతున్నారు.

Also Read..Andhra Pradesh : ఏపీ మంత్రి ఛాంబర్‌కు తాళం.. 8నెలలుగా జీతాల్లేవంటూ తాళం వేసిన సచివాలయ సిబ్బంది

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర జూన్ 14న ప్రారంభం కానుంది. కత్తిపూడి నుండి ఈ యాత్ర ప్రారంభించనున్నారు పవన్. ఇటీవలే వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్ ను జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుండి పవన్ యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ టూర్ సాగనుంది.

ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకి ఎక్కువ బలం ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఈ జిల్లాల్లో పవన్ కల్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలతో పవన్ భేటీ కానున్నారు. ప్రజలు సమస్యలను పవన్ తెలుసుకోనున్నారు.

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు నాయకులు. ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేశ్.. యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు.. రాష్ట్రవ్యాప్త పర్యటనకు పవన్ రెడీ అయిపోయారు. వారాహి యాత్రను నిర్వహించనున్నారు.

Also Read..TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ..