Minister Roja Selvamani: మాస్ డైలాగ్‌తో బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి రోజా

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు.

Roja and balakrishna

Minister Roja Selvamani Counter to Balakrishna: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కాంలతోనే సరిపోయింది.. ప్రజలకు స్కీంలు ఇచ్చింది లేదంటూ మంత్రి రోజా విమర్శించారు. ఇన్నిరోజులు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకున్న చంద్రబాబు.. ఈరోజు సాక్షాధారాలతో దొరికి వ్యవస్థలను మేనేజ్ చేయలేక జైలుకెళ్లాడని అందరికి తెలుసని రోజా అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు విషయం తెలిసి ఆయన అరెస్ట్ అయినా ఎవ్వరూకూడా రోడ్లపైకి రావడం లేదు, అయ్యోపాపం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఎవ్వరూ అనడం లేదని అన్నారు.

Read Also: Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు అతిగా ప్రవర్తించారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిది నిజంగా అక్రమ కేసు అని వాళ్లు భావిస్తే.. ప్రొసీజర్ ప్రకారం వచ్చి ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టించుకోవచ్చు. కానీ, కావాలనే స్పీకర్ పోడియం చుట్టుముట్టి సభను అగౌరవపర్చేలా వ్యవహరించారని రోజా అన్నారు. టీడీపీ సభ్యులు ఉండేది కొద్ది మంది.. మేము 151 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. మేముకూడా వాళ్లవలే ప్రవర్తిస్తే వాళ్లు అసెంబ్లీలో ఉండేవాళ్లా? అంటూ రోజా ప్రశ్నించారు. మాకు అసెంబ్లీ, చట్టాలు, స్పీకర్ అంటే  గౌరవం ఉంది కాబట్టే సైలెంట్ గా ఉన్నామని, ఇలానే ప్రవర్తిస్తామంటే వదిలిపెట్టేది లేదంటూ రోజా టీడీపీ సభ్యులను హెచ్చరించారు.

Read Also: YV Subbareddy : ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదే.. దసరా నుంచే విశాఖలో పాలన

చంద్రబాబు అరెస్టు అంశంపై సభలో చర్చింద్దామని మంత్రి బుగ్గన చెబుతున్నా.. టీడీపీ సభ్యులు మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం చూస్తే రాష్ట్ర ప్రజలకు ఒక్కటే అర్థమైంది. బావ కళ్లలో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా ప్రవర్తించాడని. నిజంగా ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినప్పుడు తన బావ చంద్రబాబుపై బాలకృష్ణ మీసం తిప్పి, తొడలు కొట్టిఉంటే ప్రజలు హర్షించేవారని రోజా అన్నారు. ఈరోజు అవినీతి కేసులో జైలుకెళ్లిన బావకోసం బాలకృష్ణ అసెంబ్లీలో రౌడీయిజం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. నేను బాలకృష్ణకు సూటిగా చెబుతున్నా.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహంలాంటి జగన్ ముందు కాదు అంటూ రోజా వార్నింగ్ ఇచ్చారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు. మరోసారి టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని రోజా హెచ్చరించారు.