Appala Raju
Minister: విశాఖ ఉక్కు విషయంలో పవన్‌కళ్యాణ్.. ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని ప్రశ్నించారు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీని ఒక్కమాట కూడా అనకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు అప్పలరాజు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీకి బద్వేల్, తిరుపతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇచ్చాడో చెప్పాలని అన్నారు.
పవన్ కళ్యాణ్ మాటలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఆరు నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విషయాలపై అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడడం శోచనీయం అన్నారు. సినిమాలు, షూటింగ్‌లని తిరుగుతూ.. ఇప్పుడు వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనడం హాస్యాస్పదమన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆడుతున్న డ్రామానే ఇదని అన్నారు. చంద్రబాబు దృతారాష్ట్ర కౌగిలి మంచి పవన్ కళ్యాణ్ బయటపడాలని, అప్పుడే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్‌పై ఒక సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అప్పలరాజు.