Seediri Appalaraju : నరసాపురంలో జరిగింది భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్- మంత్రి అప్పలరాజు సెటైర్

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్ అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. మత్స్యకారుల బతుకులు మారకూడదా? అని పవన్ ను ప్రశ్నించారు.

Seediri Appalaraju : నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. నరసాపురంలో జరిగింది మత్స్యకార అభ్యున్నతి సభ కాదని, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మంత్రి అప్పలరాజు సెటైర్ వేశారు. మత్స్యకారులను ఉద్దరిస్తామంటూ సినిమా కార్యక్రమం చేశారని పవన్ పై విమర్శలు గుప్పించారు. సినిమాల కోసం రాజకీయాలను వాడటం మొదటిసారి చూస్తున్నాం అన్నారు.

Pawan Kalyan : 217 జీవోను చింపేసిన పవన్.. మత్స్యకారుల పొట్ట కొడుతున్న వైసీపీ సర్కార్

సినిమా రిలీజ్ అన్నప్పుడల్లా పవన్ మీటింగ్ లు పెడుతున్నారని చెప్పారు. అసలు పవన్ సభలో మత్స్యకారులు ఉన్నారా? అని మంత్రి ప్రశ్నించారు. మత్స్యకారుల బతుకుల గురించి మీకేం తెలుసు అని పవన్ ను అడిగారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్ అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. బుట్టల్లో మోసుకెళ్లి అశుభ్రమైన వాతావరణంలో మా మహిళలు చేపలు అమ్ముకుంటున్నారని, అది చూస్తే నా మనసు ఎంతో బాధపడుతుందని మంత్రి వాపోయారు. రిటైల్ ఔట్ లెట్స్ అన్నీ మత్స్యకారులకు మాత్రమే అని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు.

Pawan Kalyan : మటన్, చికెన్, బ్రాందీ షాపులు పెట్టడానికా అధికారంలోకి వచ్చింది-పవన్ కళ్యాణ్

”పరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్మకం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఇది తప్పా? ఎప్పటికీ ఊరి చివర అంటరాని వారిలానే మత్స్యకారులు ఉండాలా? మా బతుకులు మారకూడదా? చక్కనైన రిటైల్ ఔట్ లెట్స్ పెట్టి చేపలు అమ్మితే తప్పేంటి? చేపల అమ్మకంపై ఏ నాయకుడు కామెంట్స్ చేసినా గుడ్డలు ఊడదీస్తాం. రిటైల్ యూనిట్స్ మంచి కార్యక్రమం. ప్రభుత్వం ఎక్కడా అమ్మదు. యువతకి ఉపాధి కల్పిస్తున్నాం. మన రాష్ట్రంలో దొరికే చేపలు మన రాష్ట్రంలోనే మార్కెటింగ్ చేసుకునే విధంగా చేస్తున్నాం. చంద్రబాబుకు మత్స్యకారులంటే చులకన, చిన్నచూపు. మేము వెళ్లినప్పుడు తొక్కి తీస్తామంటూ బెదిరించారు. చంద్రబాబు చెప్పలేనివి పవన్ తో చెప్పిస్తున్నారు. పవన్ కి సినిమాల మీద ఉన్న జ్ఞానం రాజకీయాల మీద లేదు. చంద్రబాబు స్క్రిప్ట్ ని పవన్ చదువుతారు” అని విమర్శలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.

ట్రెండింగ్ వార్తలు