Pawan Kalyan : మటన్, చికెన్, బ్రాందీ షాపులు పెట్టడానికా అధికారంలోకి వచ్చింది-పవన్ కళ్యాణ్
ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి..

Pawan Kalyan
Pawan Kalyan : నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వేటకు వెళ్లి మత్స్యకారుడు చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబాలకు మత్స్యకార భరోసా ఇవ్వడం లేదని పవన్ ఆరోపించారు. ఏడాదికి 150 మందికి పైగా మత్స్యకారులు చనిపోతున్నారని పవన్ వాపోయారు. మూడేళ్లలో 64 మందికి మాత్రమే ప్రభుత్వం.. భరోసా సొమ్ము ఇచ్చిందని చెప్పారు. మూడేళ్లలో జనసేన స్వయంగా 40 మంది కుటుంబాలకు భరోసా ఇచ్చిందని పవన్ వెల్లడించారు.
మటన్, చికెన్, బ్రాందీ షాపులు పెట్టడానికా మీరు అధికారంలోకి వచ్చింది అని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పవన్. మత్స్యకార వీరుడుకి కూడా మీరు సరితూగరు అని అన్నారు. కరోనా సమయంలో మత్స్యకారులు చెన్నై పోర్టులో ఉంటే నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లా అని పవన్ చెప్పారు. తుపాను వస్తే ఇల్లు, వలలు, పడవలు కోల్పోయి మత్స్యకారులు కష్టాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గారూ మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. మిమ్మల్ని బతిమిలాడితేనే స్పందిస్తారా? మీరు రాచరికం అనుకుంటున్నారా? భయంతో కాదు, సహనంతో భరిస్తున్నాం? 217 జీవో ద్వారా ఆన్ లైన్ తీసుకొస్తే మత్స్యకారులకు డబ్బులు ఎలా వస్తాయి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
Seediri Appalaraju : నరసాపురంలో జరిగింది భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్- మంత్రి అప్పలరాజు సెటైర్
మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని పవన్ చెప్పారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపారు. మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసన్నారు పవన్.
Pawan Kalyan : 217 జీవోను చింపేసిన పవన్.. మత్స్యకారుల పొట్ట కొడుతున్న వైసీపీ సర్కార్
“జనసేనకు కనుక ఒక్క పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ జీవో 217ని ఇచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేసి ఉండేది కాదు. చించేసేవాళ్లం!” అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు పవన్. ఈ జీవోతో లక్షలమంది పొట్ట కొడుతున్న వైసీపీ నేతలు జీవో ప్రతులను చించివేసిన తనపై కేసులు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.
ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేశంలో అంధకారం తొలగిపోవాలంటే సాహసం ఉండాలని, అలాంటి సాహసం ఉన్నవాళ్లే మత్స్యకారులు అని, మత్స్యకారుల కులాలు ఉత్పత్తి కులాలు అని వివరించారు పవన్ కళ్యాణ్.