Vellampalli
Minister Vellampalli Srinivas : ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీల మధ్య అగ్గి రాజుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తాజాగా… రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు – మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు… ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో శిలాఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సాయంతో మంత్రులు శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతి రాజును ఆహ్వానించడం జరిగిందన్నారు. దేవాలయ శంకుస్థాపనలో ఎక్కడా ప్రోటోకాల్ తప్పలేదని స్పష్టం చేశారు.
Read More : Naralokesh : నా తల్లిని కించపరిచిన వాళ్లను వదలా
వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అందుకే..గంట ముందే చేరుకొని వీరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఏ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. ఆయన మాట్లాడే తీరు అభ్యంతకరంగా ఉందని, శంకుస్థాపన కార్యక్రమాన్ని సర్కస్ తో పోల్చడం దురదృష్టకరమని వెల్లడించారు. ఏ రోజైనా ఆయన ఆలయ అభివృద్ధికి ప్రయత్నించారా అని సూటిగా ప్రశ్నించారు. రామతీర్థంలో రూ. 3 కోట్లతో ఆలయ పున నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గతంలో ఓ దురదృష్టకర ఘటన జరిగిందని, వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు పూర్తవవుతాయని ధీమా వ్యక్తం చేశారు. విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇచ్చింది కనుకే…అశోక్ ఇచ్చిన విరాళం తీసుకోలేదని మంత్రి వెల్లంపల్లి వివరణనిచ్చారు.
Read More : Kandi Farming: గిరిజన గూడాల్లో సిరులు కురిపిస్తున్న కందిసాగు
అంతకంటే ముందు..ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ…ఈ సందర్భంగా.. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ… ఘటన జరిగి ఏడాది అవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని… ఏడాదిలో గుడి కట్టి తీరుతామని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆలయ ధర్మకర్తకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని, గుడికి విరాళం ఇస్తే నా మొహంపై విసిరి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారాయన. విరాళాలు తిరస్కరించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.