Minister Vidadala Rajini : ఏపీ మంత్రి విడదల రజనికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ కు వెళ్లి వస్తుండగా.. మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించబోయి ముందు కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనుకున్న కారు వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక ముందున్న కారును ఢీకొట్టింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రమాదం జరిగిన కారులోనే మంత్రి రజని ఉన్నారు. అయితే మంత్రికి ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన కారుని వదిలేసి మంత్రి రజని, తనతో పాటు వచ్చిన మాజీమంత్రి బాలినేని కారులో తిరిగి వెళ్లారు.