Ganta Srinivasa Rao: చంద్రబాబు అరెస్టు విషయంలో జూ.ఎన్టీఆర్ తీరుపట్ల గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపి జగన్ కొరిమితో తల గోక్కున్నట్లయ్యిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు.

MLA Ganta Srinivasa Rao: స్కిల్ డవలప్‌మెంట్ కేసులో జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు (Chandrababu Arrest) నుంచి నిర్ధోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని కోరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై (YCP Govt) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఏకమవుతున్నారని అన్నారు. పరిపాలనా సంస్కరణలతో ప్రయోజనం పొందిన వారు చంద్రబాబుగా అండగా నిలిచేందుకు వేలాదిగా ముందుకు వస్తున్నారని గంటా అన్నారు. హైదరాబాద్, బెంగుళూరు‌ల్లో ఐటీ ఉద్యోగులు కృతజ్ఞతతో ముందుకు వచ్చి మద్దతిస్తున్నారని, విదేశాలనుంచి కూడా చంద్రబాబుకు మద్దతు లభిస్తుందని, వాళ్లంతా ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిస్తే రోడ్లపైకి వచ్చిన వారు కాదని గంటా శ్రీనివాస్ రావు అన్నారు.

Chandrababu Naidu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్, బాలకృష్ణ, లోకేశ్.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామం..

ఆర్ధిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే ఎలా వుంటుందో చూస్తూనే ఉన్నాం. 16 నెలలు జైల్లో వున్న జగన్ శాడిజంతో చంద్రబాబును కావాలనే జైలుకు పంపారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డవలప్మెంట్ కేసును తిరిగిపైకి తెచ్చి చంద్రబాబుపై కక్షసాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్కిల్ డవలప్మెంట్ సెంటర్‌కు తాను వెళ్లాలని చూస్తే అడ్డుకున్నారని గంటా అన్నారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమని పేర్కొన్న గంటా.. టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం ఉమ్మడి సమావేశం పెట్టాలని చూస్తున్నామని గంటా అన్నారు.

Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!

చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపి జగన్ కొరిమితో తల గోక్కున్నట్లయ్యిందని గంటా అన్నారు. చంద్రబాబు భద్రతపట్ల మాకు ఆందోళన ఉందని, ఏ చిన్న ప్రమాదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రజనీ కాంత్ సంఘీభావం ప్రకటించారు, మద్దతుగా ప్రకటన చేశారు. చంద్రబాబు సచ్చీలత తనకు తెలుసని నిర్భయంగా ఆయన తెలిపారని గంటా అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల పట్ల జగన్ ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. ప్రముఖ నటులు, డైరెక్టర్లు జగన్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు. బహుశా అందుకే భయపడి చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు ముందుకు రావడం లేదనిపిస్తోందని గంటా అన్నారు.

Chandrababu Naidu : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం అతని వ్యక్తిగతం. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకుకూడా ఆయన హాజరవ్వలేదని గంటా శ్రీనివాస్ రావు గుర్తు చేశారు. విశాఖలో తెలుగుశక్తి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించాలని చూస్తున్నామని, కానీ పోలీసుల ఆంక్షలు ఎక్కువగా వున్న కారణంగా ఇంకా ఎప్పుడన్నదీ ఖరారు కాలేదని గంటా శ్రీనివాస్ రావు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు