Chandrababu Naidu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్, బాలకృష్ణ, లోకేశ్.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామం..

చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన రోజు హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికి భద్రతా కారణాల దృష్టా పవన్ రాకను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.

Chandrababu Naidu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్, బాలకృష్ణ, లోకేశ్.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామం..

Chandrababu in Rajahmundry Central Jail

Pawan Kalyan- Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసు ( skill development case)లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు (Chandrababu)అరెస్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అరెస్ట్ చేసిన తీరు సరిగా లేదని జాతీయ స్థాయి నేతలు విమర్శిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండించారు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబును కలిసేందుకు పవన్ గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. పవన్‌తో పాటు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!

చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన రోజు హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికి భద్రతా కారణాల దృష్టా పవన్ రాకను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి సమయంలో రోడ్డు మార్గం ద్వారా పవన్ విజయవాడకు బయలుదేరారు. ఏపీ సరిహద్దు ప్రాంతంతోపాటు పలు ప్రాంతాల్లో పోలీసులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు. కానీ పవన్ వెనక్కు తగ్గకపోవటంతోపాటు బారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పవన్ కు మద్దతుగా తరలిరావడంతో పోలీసులు పవన్ ను విజయవాడ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే చంద్రబాబును స్కిల్ డవలప్ మెంట్ కేసులో అరెస్టు చేశారని పవన్ విమర్శించారు.

Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఏసీబీ కోర్టుకు కీలక ఆదేశాలు..

గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ కానున్నారు. హైదరాబాద్‌లో ఉన్న బాలకృష్ణ  ఉదయం 8గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా లోకేశ్ క్యాంప్‌కు వెళ్తారు. అనంతరం బాలకృష్ణ, లోకేశ్ సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. మరోవైపు ఉదయం 10.15 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. చంద్రబాబును కలిసి పవన్ తన మద్దతు తెలపడంతోపాటు ధైర్యం చెప్పనున్నారు. జైలులో చంద్రబాబు భద్రత విషయంతోపాటు ఆరోగ్య పరిస్థితిపై పవన్ ఆరా తీయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుటుంబ సభ్యులనుసైతం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుసైతం చంద్రబాబుతో గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ కానున్నట్లు తెలిసింది.