Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఏసీబీ కోర్టుకు కీలక ఆదేశాలు..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఏసీబీ కోర్టుకు కీలక ఆదేశాలు..

AP High Court

Updated On : September 13, 2023 / 1:57 PM IST

Chandrababu Naidu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు (AP High Court) బుధవారం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా.. సీఐడీ తరపు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోర్టును లాయర్లు కోరారు. సాక్ష్యాలు లేకున్నా రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో చంద్రబాబు లాయర్లు వివరించారు. అయితే, ఇరు వర్గాల లాయర్ల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

Chandrababu Arrest : చంద్రబాబుకి మరో షాక్.. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత

మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సిఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఐడీ పిటిషన్ పై ఎలాంటి విచారణ చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.

Chandrababu Naidu : చంద్రబాబు భద్రతపై ACB కోర్టులో వాదనలు

చంద్రబాబు అరెస్టును నిరసిన్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.  చంద్రబాబు అరెస్టు కు నిరసనగా విశాఖలో టీడీపీ ముఖ్య నేతలు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసనకు దిగిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.