Grandhi Srinivas : పవన్‌ కళ్యాణ్ ఓ హీరోయిన్‌ని, తెలియకుండా ఇంకెంతమందో.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పనవ్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వైసీపీ మంత్రులు,

Grandhi Srinivas

Grandhi Srinivas : రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పనవ్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వైసీపీ మంత్రులు, నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. అది మొదలు.. పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రిని సన్నాసి అంటూ పవన్ అనడం సిగ్గుచేటన్న ఎమ్మెల్యే గ్రంధి, పవన్ ఎంతటి సంస్కారవంతుడో ఆయన మాటలే చెబుతున్నాయన్నారు. మంత్రి సన్నాసి అయితే పవన్ కళ్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు.

ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడతారో పవన్ కే తెలియదని, ఆయనదో వింత క్యారెక్టర్ అని గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘రాజమండ్రిలో కానిస్టేబుళ్లను తిడతాడు.. మళ్లీ అనంతపురం వెళ్లి మా నాన్న కానిస్టేబుల్, పోలీసులంటే ఎంతో గౌరవమని అని చెబుతాడు. పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ హీరోయిన్‌ను పవన్ ప్రేమించి గర్భవతిని చేశాక అబార్షన్ చేయించి రూ.5కోట్లు ఇచ్చి సెటిల్ చేశాడన్న ప్రచారం కూడా ఉందని ఎమ్మెల్యే గ్రంధి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఆయన ఒక్క మాటంటే తాము వంద మాటలు అంటామని వార్నింగ్ ఇచ్చారు.

Railway : రైలులో ప్రయాణిస్తే మాస్క్ మస్ట్… మార్గదర్శకాలు పొడిగింపు

పవన్.. రెండు రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోతుందన్నారు ఎమ్మెల్యే గ్రంధి. తన అస్థికలు దేశమంతా చల్లితే తనలాంటోళ్లు పుడతారని పవన్ అనడం సిగ్గుచేటన్నారు. అంటే పవన్ ఉద్దేశంలో జనసైనికులు, వీర మహిళలు దద్దమ్మలా? అని ప్రశ్నించారు. పార్టీని అడ్డుపెట్టుకుని పవన్ జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నాడని ఎమ్మెల్యే గ్రంధి ఆరోపించారు.

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని చేసిన కామెంట్స్.. రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, టికెట్ల పంపిణీ వంటి అంశాల్లో జగన్ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రుల తీవ్రంగా ఖండించారు. పవన్ విధానాలను తప్పుపట్టారు. మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లయ్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆయన దోపిడీకి అడ్డంకిగా మారుతున్నాయి కాబట్టే అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు.