Railway : రైలులో ప్రయాణిస్తే మాస్క్ మస్ట్… మార్గదర్శకాలు పొడిగింపు

స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించలేకపోతే..రూ. 500 జరిమాన విధిస్తామని వెల్లడించింది.

Railway : రైలులో ప్రయాణిస్తే మాస్క్ మస్ట్… మార్గదర్శకాలు పొడిగింపు

Rail

Railway COVID Guidelines : భారతదేశంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నిబంధనలు పొడిగిస్తున్నాయి. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే…మాస్క్, భౌతిక దూరం, శానిటేషన్ కంపల్సరీ అని ప్రకటిస్తున్నాయి.

Read More : woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

తాజాగా..రైల్వే మంత్రిత్వ శాఖ…కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడిగించింది. స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించలేకపోతే..రూ. 500 జరిమాన విధిస్తామని వెల్లడించింది. ఈ మేరకు 2021, అక్టోబర్ 07వ తేదీ..గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Read More : Girl for Girl custome : పెళ్లి పేరుతో అమానుషాలు :ఆటా-సాటా,ఝగడా,నాత్రా సంప్రదాయాలు పేరుతో అరాచకాలు

మరోవైపు..భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. కొత్తగా 22 వేల 431 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. దేశంలో 2,44,198 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,49,856 మంది మృతి చెందారు. కరోనా పాజిటివిటీ రేటు 1.57 శాతంగా ఉంది. ప్రస్తుతం 0.72 శాతంగా ఉంది. 24 గంటల్లో 98 వేల 782 నమూనాలను పరీక్షించారు. రోజు వారీ కేసుల్లో కేసుల్లో మొదటిస్థానంలో ఉన్న కేరళలో 12 వేల 616 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 134 మంది చనిపోయారు.